17 April, 2026 | 2:40 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బండి ముత్తమ్మకు సండ్ర ఘన నివాళి

14-04-2026 12:24 AM

కల్లూరు,ఏప్రిల్ 13(విజయ క్రాంతి): మండల పరిధిలోని రఘునాథ బంజర గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బండి నరసింహారావు మాతృమూర్తి బండి ముత్తమ్మ దశదిన కార్యక్రమం సోమవారం నిర్వహించబడింది.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చిన సండ్ర వెంకట వీరయ్య,కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని సూచిస్తూ తమ సానుభూతిని వ్యక్తం చేశారు.

ఈ సంతాపభరిత వాతావరణంలో ముత్తమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రార్థించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కట్ట అజయ్ బాబు, కల్లూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ పెడకండి రామకృష్ణ, కాటమనేని వెంకటేశ్వరరావు, కుసునూరు శ్రీనివాసరావు, కావటి నరసయ్య, మాజీ సర్పంచ్ కుక్క అంజన్ రావు, ఉప సర్పంచ్ చల్లగుండ్ల వెంకటేశ్వరరావు, ఖమ్మంపాటి లక్ష్మణరావు, వార్డు సభ్యులు పొనుగుమాటి శ్రీనివాసరావు, బలుసుపాటి జగ్గయ్య,కుక్క మారేశ్వరరావు,జానపాటి రామారావు, బంధువులు, గ్రామస్తులు  పాల్గొన్నారు.