14 April, 2026 | 2:04 AM

రైల్వే అండర్ పాస్‌ను వినియోగంలోకి తేవాలి

14-04-2026 12:18 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలోని 18వ వార్డు నుండి కొత్త బజార్ అనంతారం రోడ్డు వైపు రాకపోకలకు రవాణాకు ఇబ్బంది లేకుండా రైల్వే అండర్ పాస్ ను వినియోగంలో తేవాలని సీపీఐ పట్టణ కార్యదర్శి పెరుగు కుమార్, 18వ వార్డు కౌన్సిలర్ రేషపల్లి నవీన్ డిమాండ్ చేశారు. సోమవారం  ఈ అంశంపై రైల్వే అధికారులకు వినతి పత్రం అందించగా వెంటనే స్పందించిన రైల్వే అధికారులు అండర్పాస్ ను సిపిఐ నేతలతో కలిసి పరిశీలించారు.