నూకాంబిక మొక్కు తీర్చుకున్న పవన్
11-06-2024 12:47 AM
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోమవా రం ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. పార్టీ నేతలు తనతో రావద్దని సూచించిన పవన్ కల్యాణ్ అక్కడి నుంచి అనకాపల్లి పట్టణం చేరుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని నూకాంబిక అమ్మవారిని దర్శించకొని మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. పిఠాపురంలో తాను గెలిచి, కూటమి అధికారంలోకి వస్తే అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవా రం అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.






