31 August, 2026 | 10:59 PM

Breaking News

అనర్హత పిటిషన్లలో కౌంటరు దాఖలు చేయండి

11-06-2024 12:46 AM

ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై ఇచ్చి న అనర్హత పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. స్పీక ర్ కార్యాలయంతోపాటు ఎన్నికల సం ఘా లకు కూడా నోటీసులు జారీచేసింది. బీఆర్‌ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకు న్న ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై అనర్హత వేటేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలం టూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కూనం పాండు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అడ్వొకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ అనర్హత పిటిషన్లకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని తెలిపారు. దీంతో హైకోర్టు  తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.