8 July, 2026 | 3:18 PM

మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు

11-06-2024 12:49 AM

పవన్‌కు డిప్యూటీ సీఎం, హోం, గ్రామీణాభివృద్ధి

నారా లోకేశ్‌కు ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు!

కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): భారీ అంచనాల మధ్య ఏపీలో కొత్త ప్రభు త్వం కొలువు తీరుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన, బీజేపీ భాగస్వా మ్యం కానున్నాయి. కొద్ది రోజులుగా ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ చేరుతారా? లేదా? అనే సందిగ్దత నెలకొంది. దీనిపై పవన్ క్లారిటీ ఇచ్చారు. అటు లోకేశ్ సైతం మంత్రివర్గంలో చేరనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరి పాత్రపైన స్పష్టత వచ్చింది. ఎన్నికల హామీల అమలు ఆ మూడు పార్టీల సమన్వయం ఈ ఇద్దరికి కీలకంగా మారనుంది. ఏపీలో పాలన మిత్రపక్షాల సమన్వయం చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారుతోం ది.

జనసేన, బీజేపీ నుంచి మంత్రుల సంఖ్య, శాఖలపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్, బీజేపీ ముఖ్య నేతలతో చంద్రబాబు చర్చించారు. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యా ణ్ ప్రమాణం చేయనున్నారు. టీడీపీ నుంచి 135 గెలవడం, అందునా గెలిచివారిలో సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో మం త్రుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణ లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పవన్ కల్యా ణ్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండటంతో మంత్రి వర్గంలో చేరాలా? వద్దా? అనే అంశంపై పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు.

అయితే ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ పవన్ ఈ విషయా న్ని స్పష్టంచేశారు. ఇదే అంశంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరి గినట్టు తెలుస్తోంది. జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్టు సమాచారం. శాఖలపైనా ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చా రు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్‌కు హోం, గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం.

కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఏపీలో ఆ పార్టీకి దాదాపు 5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇక నారా లోకేశ్‌కు ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్టు సమాచా రం. అమరావతి నిర్మాణం సైతం పట్టణాభివృద్ధి పరిధిలోకి రానుంది. రాజధాని కోసం ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉండటంతో లోకేశ్ వద్దే ఉంచుతారా? లేక గతం లో పర్యవేక్షించిన నారాయణకు అప్పగిస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు మంగళవారం సాయంత్రంలోగా పూర్తి చేయాలని ఏపీ ఆర్‌అండ్‌బీ శాఖ ప్రధాన కార్యదర్శి, కార్యక్రమ సమన్వయ అధికారి పీఎస్ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించా రు. గన్నవరం మండలం కేసరపల్లిలోని ఐటీ పార్క్, మేధా టవర్స్ సమీపంలో ప్రమాణ స్వీకార ప్రధాన వేదిక వద్ద సోమవారం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాట్లపై ఉన్నతాధికారులు వీర పాండ్యన్, ఎస్‌ఎస్ శ్రీధర్, పోలీసు అధికారులు, కృష్ట్రా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి సమీక్ష నిర్వహించారు. బుధవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు విచ్చేయనున్నారని, ఇందుకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు.