13 March, 2026 | 1:23 PM

పెండింగ్ బిల్లులు చెల్లించండి

21-02-2026 01:46 AM

మాజీ సర్పంచ్‌ల జేఏసీ విజ్ఞప్తి 

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): పెండింగ్ బిల్లులను ప్రభుత్వం విడు దల చేయాలని మాజీ సర్పంచ్‌ల జేఏసీ ప్ర భుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.387 కోట్లు విడుదలైనందున తమ పెండింగ్ బిల్లులను చెల్లించాలని మాజీ సర్పంచుల సంఘం జేఏ సీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్‌రెడ్డి పంచా యతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరారు.  కార్యక్రమంలో సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య,  కార్యదర్శి కేశబోయిన మల్లయ్య పాల్గొన్నారు.