28-10-2025 12:00:00 AM
పీడీఎస్‌యూ డిమాండ్
అర్మూర్, అక్టోబర్ 27 (విజయ క్రాంతి) : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. పెండింగ్ లో ఉన్న హాస్టల్ చార్జీలు బకాయిలు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఆర్మూర్ సబ్ కలెక్టర్‌కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పి.డి.ఎస్.యు. జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్‌లు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య రోజుకు హీనమైన స్థాయికి వెళుతోందని అన్నారు.
తక్షణమే పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేసి విద్య రంగాన్ని కాపాడాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. పి.డి.ఎస్.యు. ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు నిఖిల్, ఏరియా నాయకురాలు రుచిత, ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ అధ్యక్ష కార్యదర్శులు వివేక్, వినయ్, ఎస్టి కాలేజ్ బాయ్స్ హాస్టల్ అధ్యక్ష కార్యదర్శులు రాజేష్, రోహిత్ ఎస్సీ గరల్స్ హాస్టల్ నాయకులు స్వాతి, త్రిష, అఖిల, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.