calender_icon.png 31 October, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్

28-10-2025 12:00:00 AM

కామారెడ్డి అక్టోబర్ 27, (విజయ క్రాంతి): పాల్వంచ మండలం ఫరీద్‌పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పాల్వంచ మండలం ఫరీద్‌పేట గ్రామంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పత్తి చేనులో వ్యవసాయ పనులు చేసుకుంటున్న మహిళపై రైస్ మిల్లులో పనిచేసే బీహార్‌కు చెందిన కార్మికుడు ఆదివారం అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయమే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో రైస్ మిల్లును ముట్టడించారు. మిల్లులోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గతంలో రైస్‌మిల్లు ప్రాంతంలో పలువురిపై దాడులు జరిగాయన్నారు. మిల్లు యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.