మృతుని కుటుంబానికి బీమా పరిహారం చెల్లింపు
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) గూడూరు మండలం చిర్రకుంట తండాకు చెందిన భూక్యా రాజ్ కుమార్ గత ఏడాది డిసెంబర్ నెలలో 66 వేల రూపాయలతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్(Shriram Life Insurance) కంపెనీలో బీమా పాలసీ తీసుకున్నారు. పాలసీ తీసుకున్న మూడు నెలలకు ప్రమాదవశాత్తు రాజకుమార్ మరణించగా అతని కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 12 లక్షల 43 వేల 931 రూపాయలు పరిహారం క్లెయిమ్ వచ్చింది.
ఈ మేరకు మంగళవారం గూడూరులో జరిగిన కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డివో జాటోత్ హరీష్ నాయక్, పిసిసి సభ్యుడు గుగులోత్ దసురు నాయక్, మాజీ ఎంపీపీ నునావత్ రమేష్ నాయక్, బ్రాంచ్ మేనేజర్ శరత్ కుమార్ చేతుల మీదుగా మృతుడు రాజకుమార్ భార్య సునీతకు అందజేశారు. అలాగే 2004 అక్టోబర్ వరకు ప్రతినెల 6000 చొప్పున సునీతకు పెన్షన్ అందుతుందని చెప్పారు.




