27 August, 2026 | 3:39 AM

సీఎంను కలిసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

11-06-2024 04:02 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పలు సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ... వేములవాడ నియోజకవర్గంలోని పలు సమస్యలతో పాటు జిల్లాలోని సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధితోపాటు, సూరమ్మ రిజర్వాయర్ నిర్మాణం సంబంధించి సీఎంతో చర్చించినట్లు పేర్కొన్నారు. జిల్లాకు సరిపడా ఎరువులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న, నూతనంగా గెలుపొందిన ఎమ్మెల్యే గణేష్ లను కలిసి అభినందనలు తెలిపారు