15 March, 2026 | 1:59 AM

జింబాబ్వే పేసర్‌పై పీసీబీ సీరియస్

15-03-2026 12:29 AM

ఇస్లామాబాద్, మార్చి 14: పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 నుంచి ఆఖరి నిమిషంలో తప్పుకున్న జింబాబ్వే స్పీడ్ స్టార్ బ్లెస్సింగ్ ముజారబానీపై పాక్ క్రికెట్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ముజారబానీ వాస్తవానికి ఈ ఏడాది పీఎస్‌ఎల్ సీజన్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ ఫ్రాంచైజీకి ప్రాతిని థ్యం వహించాల్సి ఉంది. వెస్టిండీస్ పేసర్ షమీర్ జోసెఫ్ స్థానంలో ముజారబానీతో ఇస్లామాబాద్ పీకేఆర్ 1.1 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది.

కానీ చివరి నిమిషంలో ఐపీ ఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్ నుంచి ఆఫర్ రావడంతో ముజారబానీ తన మన సు మార్చుకున్నాడు. ఈ క్రమంలో ముజార బానీపై లీగల్ యాక్షన్ తీసుకునేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధమైనట్లు సమా చారం. ఏడాదిపాటు పీఎస్‌ఎల్ ఆడకుండా అతడిపై నిషేధం విధించాలని పీసీబీ భావిస్తోంది.