15 March, 2026 | 2:06 AM

ఢిల్లీ క్యాపిటల్స్‌కు పీటర్సన్ గుడ్ బై

15-03-2026 12:31 AM

లండన్, మార్చి 14: ఐపీఎల్ 2026 సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ కెవిన్ పీటర్సన్ షాక్ ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న పీటర్సన్ ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. త్వరలో ఇంగ్లండ్ ప్రధాన కోచ్ గా పీటర్సన్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్ పదవి నుంచి వైదొలగడానికి కారణం కూడా ఇదే కావొచ్చు.

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెంటార్‌గా ఉండటం లేదనీ, ఆ బాధ్యతలకు కావా ల్సినంత సమయం కేటాయించలేకపోతునట్టు చెప్పాడు. బ్రెండన్ మెక్‌కల్లమ్ నేతృత్వంలో ఇంగ్లం డ్ సత్ఫలితాలు సాధించలేకపోతోం ది. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో సెమీ స్ వరకు చేరుకున్న ఇంగ్లండ్ నాకౌట్‌లో భారత్ చేతిలో ఓటమిపాలయింది. మెక్ కల్లమ్ కోచ్‌గా వచ్చి న కొత్తలో బజ్‌బాల్ ఆటతో ఇంగ్లండ్ దూ కుడు ప్రదర్శించింది.

కానీ క్రమంగా బజ్‌బాల్ ఆటే ఇంగ్లండ్ కొంపముంచింది. దీంతో మెక్‌కల్లమ్‌ను కోచ్ పదవి నుంచి తొలగించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ పీటర్సన్ ఇంగ్లండ్‌కు కోచ్‌గా ఎంపికైతే ఇతర బాధ్యతలు చూడటం కష్టతరమవుతుందనే ఉద్దేశంతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.