26 June, 2026 | 1:46 AM

పెండింగ్ డీఏ, పీఆర్సీ ప్రకటించాలి

26-06-2026 12:00 AM

హనుమకొండ అర్బన్, జూన్ 25 (విజయక్రాంతి):.పెండింగ్లో ఉన్న డి ఏ లు, పిఆ ర్సి వెంటనే ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఎస్ టి ఎఫ్ ఐ పిలుపుమేరకు, భాగస్వామ్య సంఘమైన టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కాళోజీ విగ్రహం వద్ద టీఎస్ యుటిఎఫ్ హన్మకొం డ, వరంగల్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ నిరసన ప్రద ర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కా ర్యదర్శి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ , ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, వాటి పరిష్కారం కోసమే  నిరసన చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటి ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవీందర్ రాజు, కుమార్,  రాజు, సృజన్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం హనుమకొండ జిల్లా బాధ్యులు హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ రవికి  డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.