జేఎన్‌టీయూహెచ్ వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించిన జాజుల శ్రీనివాస్ గౌడ్
కూకట్‌పల్లి, జూన్ 25 (విజయక్రాంతి): విశ్వవిద్యాలయాని కి మొదటి మహిళ రిజిస్టర్ గా బీసీ మహిళను నియమించడం గర్వకారణమని వెనకబడిన తరగతుల జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వెనకబడిన తరగతుల (బి సి )వర్గానికి చెందిన డా. ఏ జయలక్ష్మిని జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ గా నియమించినందుకు గురువారం వైస్ ఛాన్స్ లర్ టి.కిషన్ కుమార్ రెడ్డిని ఆయన చాంబర్ లో ఘనంగా సన్మానించారు.
ఇది సరైన దిశలో వేసిన ముందడుగు అని అయన అభివర్ణించారు. డా. జయలక్ష్మి మహిళ నిపుణులందరికీ పూర్తిగా నిలుస్తారన్నారు. ఈ ఈ ఈ విభాగ అధిపతిగా, కళాశాల ప్రిన్సిపల్ గా, యుజిసి వ్యవహారాల డైరెక్టర్ గా పనిచేసిన విశేష అనుభవం ఉన్న డా. జయలక్ష్మి మహిళా సాధికారతకు ప్రతీకగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. శ్రీనివాస్, బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బిసి యువజన సంఘం అధ్యక్షుడు జి. భాస్కర్ పాల్గొన్నరు.






