పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి
- ఫీజుల బకాయిలు చెల్లించాలని వందలాది మందితో హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి
హాజరైన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, మార్చి 6(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమా న్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని16 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజులు, స్కాలర్ షిప్ ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటి పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్ కలెక్టర్ వద్ద వేలాది మంది బీసీ నేతలు, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ముట్టడి కార్యక్ర మానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్, రాష్ట్ర బీసీ విద్యార్ధి సంఘం అధ్యక్షులు పగిళ్ళ సతీష్ కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్‌లు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంత వరకు 8వేల కోట్లకు వెయ్యి కోట్లు కూడా ఇవ్వలేదన్నారు.
అన్ని స్కీములకు కాంట్రాక్ట్లకు వేల కోట్లు ఇస్తూ చదువుకునే విద్యార్థు లకు మాత్రం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ముట్టడి కార్యక్ర మంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కిం గ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, రాష్ట్ర విద్యార్ధి సంఘం అధ్యక్షులు పగిళ్ళ సతీష్, ఐఖ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, శివ కుమార్ యాదవ్, అంజి గౌడ్, నిఖిల్ పటేల్, చరణ్, యశ్వంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కళాకారులకు ఉద్యోగాలు కల్పించేంత వరకు కృషి చేస్తా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ శక్తి యుక్తులను ధారపోసి కోట్లాది మంది ప్రజల హృదయాలలో చైతన్యం తీసుకువచ్చిన కళాకారులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించేంతవరకు కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడటం జరిగిందన్నారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించి మూడు, నాలుగు రోజుల్లో వివరంగా చర్చించనున్నారని తెలిపారు.
బీసీ కళామండలి జాతీయ అధ్యక్షుడు శిరసనవాడ రామలింగం అధ్యక్షతన శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ ఉద్యమకారులు శిరసనవాడ రామలింగం, అను మోజు వెంకటేశం, నకిరే కంటి కిరణ్ కుమార్‌ల నేతృత్వంలో నిర్వహించిన ‘ధూం ధామ్’ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎం పీ ఆర్. కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్,
జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యంలు ప్రసంగించగా సంగం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సీ. రాజేందర్, కిరణ్ కుమార్, పల్లగొర్ల రాందేవ్ మోడీ, వందలాది మంది కళాకారులు, బీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు.




