రైస్ మిల్లులపై అధికారుల కొరడా
నాలుగింటిపై క్రిమినల్ కేసులు
21 మిల్లులపై పంచనామాలు
కామారెడ్డి, మార్చి 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని రైస్ మిల్లులపై సంబంధింత అధికారులు కొరడా ఝుళిపించారు. ఎవరైతస్త్ర సీఎంఆర్ బకాయి ఉన్నారో ఆ మిల్లులపై చట్టపర్యమైన చర్యలు చేపట్టారు. కొన్ని మిల్లులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2021 2022 రబీ మార్కెటింగ్ సీజన్ 2023- కాలంలో ప్రభుత్వానికి అందజేయాల్సిన కస్టం మిల్లింగ్ రైస్ సరఫరాలో మొత్తం 56 రైస్ మిల్లులు బకాయిలు అయినట్లు రెవెన్యూ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు.
39, 362 మెట్రిక్ టన్నుల బి య్యం ప్రభుత్వ నిబంధన ప్రకారం బకాయిల పరిమాణం పై 25% జరిమానా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైస్ మిల్లులకు జరిమానా తో కలిపి మొత్తం వసూలు చేయవలసిన పరిమాణం 49, 203 మెట్రిక్ టన్నులు బియ్యం ఇప్పటివరకు జిల్లాలోని 28 రైస్ మిల్లుల నుంచి 14,120 మెట్రిక్ టన్నులు వసూలు చేశారు. మిగిలిన 35, 082 మెట్రిక్ టన్నుల సుమారు రూ. 126 కోట్ల రూపాయల విలువైన సీఎంఆర్ బియ్యం ఇంకా సంబంధిత రైస్ మిల్లుల నుంచి వసూలు చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే నాలుగు రైస్ మిల్లులపై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశా రు. 21 బియ్యం మిల్లులపై పంచనామాలు నిర్వహించారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసుల్లో నమోదు చేసేందుకు దరఖాస్తులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మూడు రైస్ మిల్లులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అదే విధంగా ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024- సంబంధించిన చివరి తేదీ గత ఫిబ్రవరి16-తో ముగిసిన అనంతరం అదనంగా 21 రైస్ మిల్లులు 24,623 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ సరఫరాలో బకాయిలున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. సుమారు దీని అంచనా విలువ రూ. 94. 89 కోట్ల రూపాయలు కాగా ఈ కేసుల్లో పంచ నామాలు నిర్వహించారు.
సంబంధిత మిల్లర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సీఎంఆర్ లావాదేవీల్లో ఏవైనా అక్రమాలు లేదా తేడాలు గమనిస్తే వాటిని అత్యంత తీవ్రంగా పరిగణించి సంబంధిత రైస్ మిల్లర్‌పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అధికారులు పేర్కొన్నారు. కాగా సివిల్ సప్లయ్ అధికారుల చర్యలతో సీఎంఆర్ చెల్లించాల్సిన రైస్ మిలర్ల వాళ్లు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కఠినంగా చర్యలకు పూనుకోవడంతో రైస్ మిల్లర్లు ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి మొరపెట్టుకుంటున్నారు.




