10 March, 2026 | 2:08 AM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

07-03-2026 12:01 AM

కరీంనగర్ జిల్లా చొప్పదండి పరిధిలో ఇద్దరు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి సమీపంలో మరో ఇద్దరు..

చొప్పదండి/మహబూబాబాద్, మార్చి 6(విజయక్రాంతి): కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పరిధిలో ఇద్దరు మృతి చెందగా హనుమకొండ జిల్లా హసన్‌పర్తి పరిధిలో మరో ఇంజనీరింగ్ విద్యార్థులు చనిపోయారు. చొప్పదండి పరిధిలోని రుక్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై రుక్మాపూర్ నుంచి చాకుంట వైపు వెళ్తున్నటువంటి వాహనదారులను చాకుంట క్రాస్ రోడ్ వద్ద కరీంనగర్ వైపు నుంచి ధర్మారం వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం ఢీ కొట్టడంతో రుక్మాపూర్ గ్రామానికి చెందిన తాటికొండ సాయికిరణ్(౨౪), చిలుక ప్రదీప్ కుమార్(24) అక్కడికక్కడే మృతి చెందారు.

మృతుడు ప్రదీప్ తండ్రి రాజేశం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ ధర్మారం మండలం మల్లాపూర్‌కి చెందిన సాయవేణి ప్రవీణ్‌గా తెలిసింది. కాగా  హనుమకొండ జిల్లా హాసన్ పర్తిలో వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. హనుమకొండ కరీంనగర్ ప్రధాన రహదారిపై హసన్ పర్తి పెద్ద చెరువు సమీపంలో ఎస్సార్ కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు సుప్రతిక, అక్రమ్ మృతి చెందారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని విద్యార్థుల మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.