14 April, 2026 | 1:51 PM

సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు సిద్ధం..

16-12-2025 03:35 PM

పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ రిమ్స్ ఎదుట కార్మికుల నిరసన

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ రిమ్స్ కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకత్వంలో నిరసన తెలిపారు. మంగళవారం రిమ్స్ ఆసుపత్రి  ధర్నా చేసారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడూపు ప్రభాకర్ రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటాల రాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ గత ఆరు నెలల నుండి సమస్యలు పరిష్కరించాలని రిమ్స్ డైరెక్టర్ తో మాట్లాడుతూన్న ఇంత వరకు పెండింగ్ లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాలలో జమ చేయాలేదన్నారు.

పెండింగ్ వేతనం వెంటనే చెల్లించాలని, కనీస వేతనాలు రూ.26 వేలు చెల్లించాలని, సీనియార్టీ ప్రకారం  పేషెంట్ కేర్ ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పింఛన్ 5000 రూపాయలు చెల్లించి వయసు పైబడిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు కేటాయించాలని గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఏరియల్స్ ఇవ్వకుండా పోయారని పెండింగ్లో ఉన్న ఏరియల్స్ ఇప్పించాలన్నారు.  గతంలో సాధించుకున్నటువంటి సంవత్సరానికి 15 లీవులు ఇవ్వకుండా ప్రసూతి సెలవులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు మోసం చేశారని వెంటనే సంవత్సరానికి 15 లీవులు, ప్రసూతి సెలవులు మహిళా కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికుల సమస్యలు పెండింగ్ పెడితే మాత్రం ఊరుకోమని స్పష్టం చేశారు. గతంలో ఏఐటీయూసీ నాయకత్వంలో 15 రోజులు సమ్మె చేస్తే పోయిన కాంట్రాక్టర్ సమస్యల మీద అగ్రిమెంట్ రాసిచ్చారని గుర్తు చేశారు. అగ్రిమెంట్ లో అప్పుడు ఉన్న కాంట్రాక్టర్ వేణు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పనులు బంద్ చేసి, సమ్మెకు పోవాల్సి వస్తుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో అనసూయ, ఉమర్, లక్ష్మి, గంగామణి, మోహన్, ప్రమోద్, రాణి, పలువురు కార్మికులు పాల్గొన్నారు