16-12-2025 03:32:07 PM
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాల్తుమ్మెద సొసైటీ పరిధిలోని టిసి.నెంబర్ మూడవ సంఘ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినట్లు రాఘవపల్లి వంశీకృష్ణ గౌడ్ తెలిపారు.ఎందుకంటే ఇటీవల జరిగిన రెండో విడత స్థానిక సంస్థ ఎన్నికల్లో గోపాల్పేట గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందున మాల్తుమ్మెద సహకార సంఘం డైరెక్టర్కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
కావున తన డైరెక్టర్ పదవి రాజీనామాను ఆమోదించగలరని కోరుతూ సొసైటీ చైర్మన్ దుండిగల్ నర్సింలకు వినతి పత్రాన్ని అందజేశారు.అనంతరం సొసైటీ సంఘం తరఫున గోపాల్పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్కు శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీఈవో సందీప్ కుమార్,డైరెక్టర్లు గుర్రాల సిద్దయ్య,శ్రీనివాస్ రెడ్డి, రాజిరెడ్డి,రామకృష్ణయ్య, తదితరులు ఉన్నారు.