కాంగ్రెస్ పార్టీలో చేరిన కాకర్లపల్లి మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని (విజయక్రాంతి): మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ తో పాటు బీఆర్ఎస్వి నియోజకవర్గ సెక్రెటరీ ఆకుల సాయికుమార్ మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మొదటి విడత పంచాయితీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన కాకర్లపల్లి గ్రామానికి ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ లు మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నకైనా వార్డ్ మెంబర్ లు మంత్రిని శాలువాతో సత్కరించారు. గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయాలని నూతనంగా ఎన్నికైనా వార్డ్ మెంబర్లకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కనెవేన ఓదెలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెండే రాజయ్య, కనవెన కుమారస్వామి యాదవ్, వార్డ్ మెంబర్లు మేదరవేన పద్మ రాము, కలకుర్తి మౌనిక, మహేష్, సేనం సంతోష్, రామగళ్ళ రవి తదితరులు పాల్గొన్నారు.




