గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
03-09-2025 12:00 AM
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అలంపూర్ , సెప్టెంబర్ 2: క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడకారులు ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మంగళవారం వడ్డేపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఎస్ జిఎఫ్ క్రీడ టోర్నమెంట్ పోటీలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.... విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యమని తెలిపారు.క్రీడల్లో చక్కటి ప్రతిభను కనబరచి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.అనంతరం ఉపాధ్యాయ బృందం ఎమ్మెల్యే ను శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ,ఉపాధ్యాయులు విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.






