పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
బీఆర్‌ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు
చర్ల, మార్చి 4 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం విశ్రాంతి పొందిన ఉద్యోగులను మోసం చేసిందని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స వెంటనే ఇవ్వాలని బీఆర్‌ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నాయకులు బుధవారం డిమాండ్ చేశారు.
బిఆర్ యస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి తాసీల్దార్ ఆఫీసు వద్ద ప్రభుత్వానికి నిరసన తెలియజేసి అనంతరం తహసీల్దార్ శ్రీనివాసరావుకు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మీ సమస్యల వినతిపత్రం కలెక్టర్ దృష్టికి పంపిస్తాను అని తెలియజేసారు. రిటైర్డ్ ఉద్యోగ సంఘ నాయకులు డి సర్వేశ్వరరావు, పి. నరసింహరావు, బీవియస్‌యల్ నరసింహారావు, వి నాగభూషణం ఆడెపు ముత్యాలరావు ఏ నాగేశ్వర్రావు జి యస్ రాజకుమార్ బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజీజ్ కాకి అనిల్ పంజా రాజు గోరింట్ల వెంకటేశ్వరావు యూత్ నాయకులు బొజ్జ సాయిప్రణీత్ గాధం శెట్టి కిషోర్ కుమార్ పాసిగంటి సంతోష్ సి హెచ్ వంశీ మహిళ నాయకురాలు బేతం చర్ల నర్సవేణి అంకాల శ్రీనివాసరావు అనేకమంది రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు




