కేటీపీఎస్ ఏడవదశలో కార్మికులకు ఇంచార్జ్జి పదోన్నతులను కల్పించాలి
కేటీపీఎస్ ఏడవదశ చీఫ్ ఇంజనీర్‌కు (హెచ్-142) వినతి
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 4 (విజయక్రాంతి): తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (హెచ్-142) రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.రామారావు ఆధ్వర్యంలో బుధవారం కేటీపీఎస్ ఏడవ దశ చీఫ్ ఇంజనీర్ జె.సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కార్మికులకి ఇన్చార్జి పదోన్నతులు కల్పించాలని వినతి పత్రమును సమర్పించారు. కేటీపీఎస్ ఏడవ దశనందు 2024-25 సంవత్సరం నకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ )ను నిర్వహించారని, కొన్ని అనివార్య కారణాలవల్ల కార్మికులకు పదోన్నతులు ఇవ్వలేదని వివరించారు. జేపీఎ నుండి ఫోర్ మెన్ గ్రేడ్-1 వరకు 25 మంది కార్మికులు ,జూనియర్ అసిస్టెంట్ నుండి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వరకు ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులు రావాల్సి ఉన్నద నీ సి ఈ కి వివరించారు.
ఇటీవల టీజీ జెన్కో యాజమాన్యం ఆదేశాల మేరకు వైటిపిఎస్ దామరచర్ల నందు గత నెల ఏడవ తారీఖున కార్మికులకు ఇన్చార్జి పదోన్నతుల ఉత్తర్వులను అందజేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే కార్మికులకు ఇన్చార్జి పదోన్నతులు ఇవ్వటానికి కృషి చేస్తాననీ చీఫ్ ఇంజనీర్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ డి సత్యరాజ్ స్టీవెన్ వెంపటి వెంకటేశ్వర్లు, షేక్ సయ్యద్ , టి రాములు తదితరులు పాల్గొన్నారు.




