calender_icon.png 20 February, 2026 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల బకాయిల నిధులు విడుదల చేయాలి

20-02-2026 12:00:00 AM

  1. లేని పక్షంలో 2నఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు
  2. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్

ముషీరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఉద్యోగ విరమణ పొందిన ఉద్యో గుల, ఉపాధ్యాయుల ప్రయోజనాల కొరకు ఈ బడ్జెట్ సమావేశాలలో ప్రత్యేక నిధులు విడుదల చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చి 1లోపు రిటైర్మెంట్

అయిన ఉద్యోగ ఉపాధ్యాయు లకు వారి బెనిఫిట్స్ చెల్లించక పోతే, మార్చి 2 నుంచి నిరాహార దీక్ష చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణారెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా వారు చేపట్టే నిరాహార దీక్షకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులం దరూ నిరాహార దీక్ష చేస్తామన్నారు. కార్యక్రమంలో కోశాధికారి కనపర్తి దివాకర్, కార్యద ర్శి బుర్ర సుధాకర్, అంబటి వేణుకుమార్, ఆనందం, శ్రీనివాస్, రవీందర్‌కుమార్, లక్ష్మీనారాయణ, అనంతరెడ్డి పాల్గొన్నారు.