30 March, 2026 | 2:10 PM

Breaking News

బీజేపీ పాలనలో ప్రజలు సుభిక్షం

05-05-2024 02:07 AM

ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4 (విజయక్రాంతి): బీజేపీ పాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు శనివారం బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ సంరక్షణ కోసం మోదీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం మైదానంలో నిర్వహించనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయ సంకల్ప సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.