30 March, 2026 | 3:33 PM

వెన్నెల నగర్ లో నీటి, కరెంటు సమస్య పరిష్కరించాలి

30-03-2026 01:47 PM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): కొత్తగూడెం కార్పొరేషన్ తొలి సమావేశం కు వెన్నెల నగర్ నీటి, కరెంటు సమస్యలతో సోమవారం నూతన కార్పోరేటర్ల అందర్నీ స్వాగతం పలికారు. సేవ్ కొత్తగూడెం సేవ్ కార్పొరేషన్ కన్వీనర్, ఆవాజ్ పట్టణ కార్యదర్శి జలాల్ ఆధ్వర్యంలో  స్థల లబ్ధిదారులతో కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలాలు అప్పగించి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకవర్గం ఆ ప్రాంత సమస్యలు పరిష్కరించడంలో వైవిద్యం చూపారని విమర్శించారు.  గత ఐదేళ్లు కాలయాపన తప్ప కనీస సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపలేదన్నారు.

అనేకసార్లు ఆందోళన కార్యక్రమాలు, విజ్ఞప్తులు చేసినప్పటికీ పెడచెవున పెట్టారని  పేర్కొన్నారు. గత మూడు నెలల క్రితం మూడు బోర్లు వేసి కరెంటు కలెక్షన్ ఇవ్వకుండా నిరుపయోగంగా వదిలేశారన్నారు. నూతన పాలకవర్గం వెన్నెల నగర్ కు ప్రత్యేక నిధులు కేటాయించాలని, అవసరమైతే ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధుల కోసం తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం  మేయర్ మూడ్ గణేష్ కు అందజేశారు. తక్షణమే వెన్నెల నగర్ పర్యటించాలని అక్కడి సమస్యలు ప్రత్యక్షంగా చూడాలని  విజ్ఞప్తి చేశారు. మేయర్ మాట్లాడుతూ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నీటి కరెంటు సమస్యకు ఎంత నిధులు అవుతాయో అధికారులకు అడిగి తెలుసుకుంటామని, ఎక్కువ మొత్తంలో మున్సిపాలిటీ నుండి కేటాయించలేమని స్థానిక ప్రజాప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.