30 July, 2026 | 2:18 AM

పీఎంశ్రీ విద్యాలయ్.. పిషాప్ కర్నేబి జాగా నై!

30-07-2026 01:44 AM

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో దుస్థితి

నాగర్ కర్నూల్, జూలై 29 ( విజయక్రాంతి )కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పీఎంశ్రీ పాఠశాలగా ఎంపికైన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల నిర్వహణ అధ్వానంగా మారింది. మరుగుదొడ్లు మూత్రశాలలు లేకపాఠశాల ఆవరణలో ఇలా బహిరంగంగా మల మూత్ర విసర్జన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

మరి కొంతమంది విద్యార్థులు బ స్టాండ్ ప్రాంగణంలోని మరుగుదొడ్డికి డ బ్బులు చెల్లించి మరి వెళ్తున్న పరిస్థితి. అ యినా జిల్లా విద్యాధికారులు సైతం తమకే మీ పట్టనట్లు వ్యవహరించడంతో విద్యార్థు ల హాజరు శాతంపై ప్రభావం పడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నా రు.

పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు చె త్తాచెదారం పేరుకుపోయి దుర్ఘంద భరితం గా మారి దుర్వాసన వెదజల్తోందని, అక్కడే మధ్యాహ్న భోజనం కూడా వడ్డించడంతో విద్యార్థుల కొంత మంది వాంతులు చేసుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఆ పా ఠశాల ప్రధానోపాధ్యాయులు రాంజీ స్ప ందిస్తూ పాఠశాలలో 210 మంది బాలికలు 300 మంది బాలురు ఉన్నారని బాలికల కొరకు మరుగుదొడ్లు మూత్రశాలలు కొంతమేర ఉన్నాయని బాలురల కొరకు మాత్రం జిల్లా విద్యాశాఖ అధికారులకు నివేదిక ఇచ్చామని తెలిపారు. పాఠశాల పరిశుభ్రత కొరకు చర్యలు తీసుకుంటామన్నారు.