కాస్త నీడ ఏర్పాటు చేయండి మహాప్రభో!
మూడు రాష్ట్రాలకు కలుపుతున్న కేంద్రబిందువు....?
అయిజ ఏప్రిల్ 20: తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మూడు రాష్ట్రాలను కలుపుతున్న ఏకైక కేంద్ర బిందువు అయిజ బస్టాండ్. సుమారు వందల గ్రామాలను అనుసంధానం చేసే, వేల మంది ప్రజలను తమ గమ్యస్థానాలకు చేరవేసేది అయిజ బస్టాండ్. ప్రతిరోజు వేలమంది ప్రయాణం చేస్తూ లక్షల్లో ఆదాయం తీసుకొస్తున్న అయిజ బస్టాండ్ ప్రయానికులకు అనుకూలంగా లేదనీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
సుమారు చుట్టూ 5 మండలాలు 40 లేదా 50 గ్రామాలకు వ్యాపార కేంద్రంగా మరియు నిత్యం ఆ గ్రామాలనుండి వేల సంఖ్యలో ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రులకు వస్తున్న రోగులు ఇలా అనేక విధాలుగా కిక్కిరిసి ప్రయానిస్తున్న అయిజ బస్టాండ్ అసౌకర్యలకు నిలయంగా మారిందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మంది నాయకులు మారినా బస్టాండ్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది అనే సామెతలా తయారైందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఉన్న ఆ కొద్ది బస్టాండ్ బస్సులు నిలిపె ప్రదేశం మరీ భయానకం. ఎగుడు దిగుడులతో కంకర తేలి ఇబ్బందికరంగా ఉన్నది అట్టి ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు వృద్దులు బస్సు ఎక్కాలంటే నరకానికి బస్సు ఎక్కినట్టుగా భావిస్తున్నారు. కర్నూలు, రాయచూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు వెళ్లే బస్సులు దూరాన ఉన్న సమతల ప్రదేశంలో బస్సులు నిలపడం వల్ల ప్రజలు కూడా బస్సు నిలిచే ప్రదేశంలో ఎండ వేడికి ఓర్చి బస్సులకై వేచి చూడడం జరుగుతుంది.బస్సు ప్రాంగణం ఒకచోట బస్సులు నిలిపేది మరొకచోట కావడం, బస్సు నిలిపే ప్రదేశంలో నీడ లేక ఎండవేడికి అల్లాడిపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
ఇక్కడి నుండి ప్రజలు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అట్టి ప్రదేశంలో పిల్లలు వృద్దులు సుమారు 40 డిగ్రీలు దాటుతున్న ఎండ వేడిలో నిలవడం వల్ల వడదెబ్బలకు గురికావాల్సి వస్తుంది. అసలు బస్సు ప్రాంగణ నిర్మాణం చుస్తే ఇంజనీరింగ్ సూచనలతో నిర్మించారా ? లేక అధికారుల అంచనాలతో వేశారా ? అన్న అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.
ప్రజలు ప్రయాణం చేయడం ద్వారా ఆర్టీసీకి వస్తున్న లక్షల్లో ఆదాయం వల్ల ప్రజలు నిలవడానికి కాస్త నీడైనా ఏర్పాటు చేయండి ? లేదా బస్సు నిలుపు ప్రాంగణమైన బస్సులు నిలపడానికి అనుకూలంగానైనా చేయండి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.బస్సులు నిలుపు ప్రాంగాణంలో బస్సులు నిలవడానికి అనుకూలంగా ఏర్పాటు చెసినచో ప్రజలు కూడా బస్టాండ్ లోనే నీడన ఉంటారనీ ప్రయాణికులు బావిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులైన ఇట్టి సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేవిధంగా చూడాలని కోరుతున్నారు.
ఆంజనేయులు, దండోరా సీనియర్ నాయకులు
ఇక్కడ నుండి సుమారు వేల మంది ప్రజలు, వందల కిలోమీటర్లు ప్రయాణం చేయవలసి ఉం టుంది. ప్రస్తుత ఎండాకాలంలో విపరీతమైన ఎండల వల్ల పిల్లలు వృద్దులు వడదెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నది. అందువల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ కానీ అయిజ మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ గాని మానవతా దృక్పథంతో నెట్టు లాంటి నీడను ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుచున్నాము.






