మంత్రికి కృతజ్ఞతలు
మహా ముత్తారం,(విజయక్రాంతి): వనకాలంలో ప్రాణాలకు తెగించి పెద్దవాగు దాటే మా ప్రాంత ప్రజల కష్టాలని గుర్తించి, మా నిమ్మగూడెం ప్రజల చిరకాల స్వప్నమైన పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.7 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేసిన మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబుకి మా నిమ్మగూడెం గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూన్నాం. అనునిత్యం రద్దీగా ఉండే ఆ రోడ్ మార్గం ఈ బ్రిడ్జి నిర్మాణంతో యావత్ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రజలు కూడా రాకపోకలు ఎంతో సౌలభ్యం కలుగుతుంది.
అలాగే రైతులకు, ప్రజలకు,విద్యార్థులకు, అత్యవసర సమయంలో ఇది ఎంతో ఉపయోగ పడుతుందని, ప్రజాసమస్యపై సానుకూలంగా స్పందించి వెంటనే నిధుల కేటాయింపుకు శ్రీకారం చుట్టిన మంత్రి కి, అధికారులకు నిమ్మగూడెం గ్రామ ప్రజల తరుపున బౌతు రాజేందర్ కాంటెస్ట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు. అభివృధి అంటే ఇదే అని మంత్రిగారు మరో సారి నిరూపించారు. మీ చొరవతో వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు అని నిమ్మగూడెం ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.






