12 August, 2026 | 9:47 PM

వైభవంగా వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవం

12-08-2026 08:44 PM

సిద్దిపేట క్రైం,(విజయక్రాంతి): సిద్దిపేట పట్టణ మార్కెట్ చౌరస్తాలోని వీర హనుమాన్ ఆలయ వార్షికోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. పురోహితులు స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సుందరకాండ పారాయణం చేశారు. అనంతరం హనుమాన్ , సువర్చల మూర్తులను పల్లకీలో పురవీధుల గుండా ఊరేగించగా, మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. కోమటిచెరువులో స్వామివారి మూర్తికి చక్రస్నానం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో రవికుమార్, ఉద్యోగి శ్రీకాంత్ రెడ్డి, వీర హనుమాన్ సేవ సమితి సభ్యులు బాల మల్లేశం, హరి, ఆత్మ రాములు, ధర్మపురి, అశోక్ కుమార్, నరేష్, అనిల్, కిషన్ పాల్గొన్నారు.