12 August, 2026 | 9:39 PM

బెజ్జంకి పీఏసీఎస్‌ నూతన పాలకవర్గం ఎన్నిక

12-08-2026 08:07 PM

- చైర్మన్‌గా ఒగ్గు దామోదర్

బెజ్జంకి,(విజయక్రాంతి): బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పాక్స్) నూతన పాలకవర్గం ఎన్నికైంది. చైర్మన్‌గా ఒగ్గు దామోదర్ ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా చెట్టి రాజు, నూనె రాజేందర్, కట్ట స్వరూప, అడకాని నర్సింగం, గంగాధర రామచంద్రం, కేడిక అపర్ణ, బైర రాజేందర్, తుమ్మ సుధాకర్ రెడ్డి, మాశం శంకర్, లింగాల రామవ్వ, కొమ్మెర తిరుపతి, కుక్కల రాములు ఎన్నికయ్యారు. ఎన్నిక ప్రక్రియకు సహకరించిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నూతన పాలకవర్గం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, పీఏసీఎస్‌ ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. నూతన చైర్మన్‌ ఒగ్గు దామోదర్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు పలువురు రైతులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.