12 August, 2026 | 9:53 PM

గుంతల పూడ్చివేత

12-08-2026 08:00 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని పలు రహదారులు గుంతలమయంగా మారడంతో వాటిని పూడ్చి, రహదారులను చదును చేసే కార్యక్రమాన్ని మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, పాలకవర్గ సభ్యులతో కలిసి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. మల్లాపూర్‌లో ఎక్కడ చిన్న గుంత కనిపించినా వాటిని పూడ్చివేయడంతో పాటు, గుంతలమయమైన దారులను ట్రాక్టర్ సహాయంతో చదును చేయిస్తున్నట్లు తెలిపారు.

గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి స్వచ్ఛ మల్లాపూర్ గా తీర్చిదిద్దేందుకు గ్రామస్థులంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, అరికుప్పల రాజం, మహమ్మద్ షబ్బీర్, ఎనుగంటి నరేష్, శనిగారపు లావణ్య–నరేష్, అల్లె లత–చంద్రయ్య, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. గుంతల పూడ్చివేత, రహదారుల చదును కార్యక్రమాన్ని ప్రారంభించిన పాలకవర్గానికి గ్రామస్థులు అభినందనలు తెలిపారు.