21 July, 2026 | 10:58 AM

ఏఎస్‌డబ్ల్యూ ఆఫీసును మార్చాలన్న ఆలోచన విరమించుకోవాలి

21-07-2026 12:00 AM

జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన ప్రజా సంఘాలు

చుంచుపల్లి, జూలై 20 (విజయక్రాంతి): కొత్తగూడెం జిల్లా కేంద్రం లో గల ఏ ఎస్ డబ్ల్యూ ఓ కార్యాలయాన్ని మార్చే ఆలోచన విరమించుకోవాలని ప్రజాసంఘాలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. గత 30 40 సంవత్సరాల నుండి కొత్తగూడెం డివిజన్ కేంద్రంగా ఏ ఎస్ డబ్ల్యూ  ఓ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ కొనసాగుతోందని,  గత ఎనిమిది నెలల నుండి ఈ ఆఫీస్ ని నిర్వీర్యం చేస్తూ విద్యుత్, నీళ్లు లేకుండా ఆఫీస్కు బోర్డు,  సమాచార చట్టం బోర్డు లేకుండా చేస్తున్నారని.

తాజాగా  కార్యాలయాన్ని ఐ డి ఓ సి కి మార్చాలని ఒత్తిడి చేస్తున్నారని వారు తెలిపారు.  11 మండలాలకు డివిజన్ కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో వెనుకబడిన దళిత కులాలకు ఉన్నటువంటి ఆఫీసు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటూ వస్తుంది. ఇప్పుడు కిరాయి కట్టడం లేదు. ప్రైవేట్ కాంప్లెక్స్ లలో ఉంటానికి వీలులేదని చెబుతూనే ఖాళీ చేస్తున్నారని వారు తెలిపారు. .జాయింట్ కలెక్టర్ స్పందించి ఎస్సీ డిడి తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని  హామీ ఇచ్చారు.