18 April, 2026 | 7:57 AM

రైతులంతా అగచాట్లు పడుతుంటే.. అందాల పోటీలపై రాష్ట్ర సర్కార్ శ్రద్ధ

15-05-2025 01:07 AM

వనపర్తి, మే 14 (విజయక్రాంతి): రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈరోజు  మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి  బుధవారం ఒక ప్రకటన ద్వారా ఘాటుగా స్పందించారు. రైతులంతా ఆగచాట్లకు గురైతుంటే రాష్ట్ర సర్కార్ అందాల పోటీలపై శ్రద్ద పెడుతుందని చాలా బాధపడేటువంటి విషయమన్నారు.రైతులకు సర్కార్ ఇచ్చిన అనేక హామీల మా ట నిలబెట్టుకోవడంలో విఫలం అయినా కస్టపడి పంట సాగు చేశారని చివరకు కొనే దగ్గర రై తంగాం అనేక రకాల అవస్థలకు గురవుతున్నారు.

కొనుగోలు విషయంలో ప్రతిరోజు రైతులు ధర్నా చేస్తు రోడ్లపైకి వస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలు చేస్తున్నవి కావని స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి ధర్నా చేస్తున్నారని పండించిన పంటకొంటాం అన్న సర్కార్ ఎందుకు కొనట్లేదాని రైతులు ప్రశ్నిస్తున్నారు..కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు ఎందుకు కాయల్సి వస్తుందని ధాన్యం కాంట వేయడానికి వేసిన దానిని మిల్లులకు తరలించడానికి రోజుల తరబడి సమయం పడుతుందన్నారు.

పది హేను నుండి ఇరవై రోజులు ప్రాసెస్ కంప్లీట్ కావడానికి సమయం పడుతుందని తీవ్రమైన ఎండలు ఉన్నాయని ఎందుకు సర్కార్ ఇంత వైఫల్యం చెందుతుందని ఏం జరుగుతుందని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు తరలించడం లో ట్రాన్స్పోర్ట్ చాలా కీలకమని బి ఆర్ ఎస్ హాయం లో ట్రాన్స్ పోర్ట్ టెండర్ లు పారదర్శకంగా నిర్వహించామని వాళ్ళు వాహనాలు సకాలంలో పంపించకపోతే టెండర్ రద్దు చేసేవాళ్ళమన్నారు.

ట్రా న్స్పోర్ట్ టెండర్ లు వారికి అర్హత లేకున్నా.. వాహనాలు లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టారని  అందుకే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. తక్షణమే తడిసిన, కొట్టుకుపోయిన ధా న్యం కు రైతంగానికి పరిహారం కట్టించాలని అని ఆయన ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.