calender_icon.png 8 May, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కష్టసుఖాలే ముఖ్యం

22-04-2025 10:25:55 PM

కాటారం (విజయక్రాంతి): పదవులు ముఖ్యం కాదని, ప్రజల కష్టసుఖాలే ముఖ్యమని కాటారం మాజీ ఎంపీటీసీ తోట జనార్ధన్ అన్నారు. మంగళవారం ఆయన కాటారం మండల కేంద్రంలోని అంగడి బజార్లో గల బోరు మోటర్ ను నూతనంగా బిగించిన అనంతరం మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాను ప్రజల మధ్యలో ఉండి పని చేస్తానని అన్నారు. పార్టీలకతీతంగా ప్రజల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని జనార్ధన్ కోరారు. కమ్మరి వాడలో గత కొన్ని రోజుల నుండి బోర్ మోటార్ చెడిపోయి నీరు రాక ఇబ్బంది పడడంతో అక్కడి ప్రజలు మాజీ ఎంపీటీసీ సభ్యులు తోట జనార్దన్ కు విన్నవించుకోవడంతో ఆయన వెంటనే స్పందించి కొత్త బోర్ మోటార్, స్టార్టర్ ఇప్పించారు. ఈ సందర్భంగా ఆ వాడలోని ప్రజలు జనార్ధన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దుర్గం తిరుపతి, అక్కపాక మల్లయ్య, ఆనందం, అన్వర్ పాష తదితరులు పాల్గొన్నారు.