08-05-2025 09:52:48 AM
హైదరాబాద్: ములుగు జిల్లా(Mulugu district) వెంకటాపురం మండల సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం మందుపాతర పేలుడు(landmine explosion) సంభవించింది. మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తుండగా మందు పాతర పేలింది. ఈ పేలుడులో ముగ్గురు పోలీసులు దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నారు. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో 17 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 200 మందుపాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్రెగుట్ట ప్రాంతంలో జరిగిన ఒక పెద్ద ఎన్‌కౌంటర్ తర్వాత ఈ ఘటన జరిగింది. భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మరణించారు. ఈ సంఘటన మావోయిస్టులను నిర్మూలించడానికి ఉద్దేశించిన ఆపరేషన్ కాగర్‌లో భాగం.