08-05-2025 12:36:47 PM
రాయపర్తి: రాయపర్తి మండలం మోతిరాల గ్రామంలో సోమవారం ఉదయం సామాజిక సేవా కార్యక్రమం శుభారంభమైంది. ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి(SRR Foundation Chairman Srinivas Reddy) గ్రామంలోని స్థానిక హమాలీ కార్మికులకు ప్రత్యేకంగా టీ షర్ట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. "పేదలకు, కార్మికులకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. మానవతా ధర్మంతో ఈ చిన్న కార్యక్రమం ప్రారంభించాం. ముందుకు కూడా ఇదే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతాం" అని తెలిపారు. గ్రామస్థులు, కార్మికులు ఈ కార్యక్రమాన్ని అభినందించారు. హమాలీ కార్మికులు తమపై చూపిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ టీ షర్ట్స్ లను అందించిన వారిలో బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi) మండల పార్టీ అధికార ప్రతినిధి తాళ్లపెల్లి సంతోష్ గౌడ్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ అనిరెడ్డి యాకుబ్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు చేగురి మల్లేష్ పార్టీ ముఖ్య నాయకులు బొమ్మేర మహేష్, తదితరులు పాల్గొన్నారు.