calender_icon.png 8 May, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెలికాప్టర్ కూలిన ఘటనలో 6కు చేరిన మృతుల సంఖ్య

08-05-2025 10:16:43 AM

ఉత్తరకాశి: ఉత్తరాఖండ్‌లోని(Uttarakhand) ఉత్తరకాశి జిల్లాలోని గంగ్నాని సమీపంలో హెలికాప్టర్(Helicopter Crash) కూలిన హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ప్రస్తుతం  ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై స్పందిస్తూ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ, "సహాయం, రక్షణ చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్(State Disaster Response Force) జిల్లా పరిపాలన బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారికి సాధ్యమైనంత సహాయం అందించాలని, ప్రమాదంపై దర్యాప్తు చేయాలని నేను పరిపాలనను ఆదేశించాను." అని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.