calender_icon.png 10 October, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42 శాతం బీసీ రిజర్వేషన్ అంతా బోగస్

10-10-2025 12:14:21 AM

  1. బీసీ లపై కాంగ్రెస్ పార్టీ, రేవంత్ కపట ప్రేమ బట్టబయలు.

ఓడిపోతామనే సీఎం బీసీ డ్రామా మొదలుపెట్టాడు

బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పాల్వంచ, కో ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 9 (విజయక్రాంతి):కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ అంతా బోకస్ అని, సార్వత్రిక ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి మోసం చేసిన తీరులోనే, బీసీ రిజర్వేషన్ ద్వారా బీసీలను మోసం చేశారని బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు, పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ పై హైకోర్టు ఇచ్చిన స్టే పై గురువారం స్పందించిన ఆయన సార్వత్రిక ఎన్నికల ముందు 6 గ్యారంటీలు 420 హామీల పేరుతో అలవి కాని బోగస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని.

ఏడాదిన్నరలోనేకాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని, ఈ నేపథ్యంలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామనీ మరో మారు హామీ గుప్పించిన విషయం విదితమే. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఘోరంగా ఓడిపోతామన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడి బీసీ రిజర్వేషన్ ను తెరమీదకు తెచ్చారని ఆరోపించారు.

ఆర్భాటంగా జీవో నెంబర్ 9 ద్వారా రాజ్యాంగానికి విరుద్ధంగా బిసి రిజర్వేషన్లు చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి బీసీ లపై చిత్తశుద్ధి లేదని జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే విధించడం ద్వారా మరోసారి నిరూపితం అయిందన్నారు. తక్షణమే డ్రామాలు ఆపి ప్రతిపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఎలక్షన్లు సజావుగా జరిగేలా ఆలోచన చేయాలని, రిజర్వేషన్ల పేరుతో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే బిఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ప్రజా కోర్టులో శిక్ష తప్పదని, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదన్నారు.