calender_icon.png 10 October, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం

10-10-2025 12:16:31 AM

-అంతర్ పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కల స్వాధీనం

-వివరాలను వెల్లడించిన డిఎస్పీ జీవన్ రెడ్డి

ఆదిలాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): జిల్లా పోలీస్ యంత్రాంగం గంజాయిని ఉక్కు పాదంతో అణచివేస్తుంది. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో  గంజాయి సాగు, విక్రయం, అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తరచూ దాడులు జరుపుతూ కఠినంగా వ్యవహరిస్తూ గంజా యి రవాణా చేసిన, సేవించిన, పండించిన, వ్యాపారం చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలతో అణచివేస్తుంది .

ఇప్పటికే పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, తాజాగా గంజాయి సాగుపై పోలీసులు దాడి చేశారు. ఈ మేరకు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. రూరల్ మండలంలోని అసోద గ్రామంలో భారీ ఎత్తున గంజాయి మొక్కలు పెంచుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రూరల్ ఎస్సై వి విష్ణువర్ధన్ ప్రత్యేక బృందంతో మెస్రం భుజంగ రావు అనే వ్యక్తి పంటచేలలో పత్తి పంట, కంది పంట మధ్యలో అంతర్ పంటగా గంజాయి మొక్కలను పెంచుతున్నారన్నారు.  ఈ సోదాల్లో 160 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోనీ నిందితున్ని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ.16 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. 

గంజాయి పండిస్తున్న వారి పట్ల కేసులు నమోదు చేసి వారికి ప్రభుత్వ పథకాలు వర్తించకుండా జిల్లా కలెక్టర్ కి నివేదికలు పంపనున్నట్లు తెలియజేశారు. భారీ ఎత్తున గంజాయిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సీఐ ఫణిధర్, రూరల్ ఎస్త్స్ర విష్ణువర్ధన్, సిబ్బంది మంగల్ సింగ్, విటల్, సురేష్ లను ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు.