10-10-2025 12:14:14 AM
ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్9(విజయక్రాంతి):ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం జైనూరు మండలంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, తరగతిగదులు, మధ్యా హ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా పివో మాట్లాడు తూ విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధ న చేయాలని తెలిపారు. వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచిం చారు. విధులలో నిర్లక్ష్యం వహించిన పాఠశా ల ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.