80 శాతం గణితం టీచర్లకు లెక్కలు రావు
ఈఐ ఎడ్యుటెక్ సంస్థ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 28: భారత్, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రాథమిక స్థాయి గణితం టీచర్లలో 80 శాతం మందికి ప్రాథమిక అంశాల్లో కూడా పట్టులేదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రముఖ ఎడ్యుటెక్ కంపెనీ ఈఐ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్, యూఏఈ, ఒమన్, సౌదీ అరేబియా దేశాల్లో 3 నుంచి ౬వ తరగతి వరకు గణితం బోధిస్తున్న 1,300 మంది టీచర్లను సర్వే చేసింది. భారత్‌లోనే 152 స్కూళల్లో సర్వే చేశారు. ఈ సర్వేలో టీచర్లు గణతంలో ప్రాథమిక భావనలైన శాతాలు, ఆల్జీబ్రా, ఎస్టిమేషన్ వంటి అంశాల్లో తప్పులు లేకుండా లెక్కలు చేయలేకపోయారని ‘అనాలిస్ ఆఫ్ ఇన్‌సర్వీస్ మ్యాథమాటిక్స్ టీచర్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ మిస్‌కన్సెప్షన్ ఆన్ ప్రైమరీ అండ్ మిడిల్ గ్రేడ్ మ్యాథమాటక్స్ కాన్సెప్ట్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు.






