12 July, 2026 | 11:47 AM

సునీతా రాక మరింత ఆలస్యం

29-06-2024 12:57 AM

బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య

తిరుగు ప్రయాణంపై స్పష్టతనివ్వని నాసా

న్యూఢిల్లీ, జూన్ 28 : బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లు అక్కడే చిక్కుకుపోయారు. తిరిగి భూమి మీదకి వచ్చే సమయంలో వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో స్పేస్ క్రాఫ్ట్‌లోనే తలదాచుకోవాల్సి వచ్చింది. హీలియం లీక్ కావడంతో వారి ప్రయాణం అక్కడే నిలిచిపోయింది. దీంతో, వారు భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారనే విషయంపై నాసా స్పష్టత ఇవ్వలేదు. జూన్ 5న సునీతా విలియమ్స్, విల్మోర్ ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం వారు జూన్ 14న తిరిగి భూమిపైకి రావాల్సి ఉంది.

స్పేస్‌షిప్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. జూన్ 26న తిరిగి భూమిపైకి రావాల్సి ఉండగా.. మరోసారి సాంకేతిక సమస్య తలెత్తడంతో పర్యటన వాయిదా పడింది. అయితే, ప్రస్తుతం, సునీతా, విల్మోర్ ఇద్దరూ ఇతర ఏడుగురు సిబ్బందితో పాటు సురక్షితంగా ఉన్నారని నాసా ప్రకటించింది. వారు జూలై 2న భూమిపైకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎలాంటి సమస్యలు లేకపోతేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొంది.