జిల్లాలో 97.8 శాతం పల్స్ పోలియో
జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.గణేశ్వర్
మెదక్, జూన్ 28 (విజయ క్రాంతి) :జిల్లాలో ( పోలియో ఆదివారం) 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , 157 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు , 1 అర్బన్ హెల్త్ సెంటర్ , కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పటల్ పరిధిలో గల 5 సంవత్సరముల లోపు పిల్లలకు 97.8 శాతం పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ తెలిపారు. 457 పోలియో బూతులు, 46 రూట్లు, 20 ట్రాన్సిట్ సెంటర్లు, 872 టీమ్స్ , 1828 సిబ్బంది ద్వారా 75496 మంది పిల్లలకు గాను ఈరోజు 73643 మంది పిల్లలకు ( 97.8 శాతం) పోలియో చుక్కలు వేశామని, నాతో పాటు , జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. జయశ్రీ , డిప్యుటి డి.ఎం.హెచ్.ఓ. లు , ప్రోగ్రాం అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది పాల్గొని పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆదివారం పోలియో బూత్ ల వద్ద పోలియో చుక్కలు వేసుకోని 5 సంవత్సరాల లోపు పిల్లలకు వారి ఇంటివద్దకే వెళ్లి రేపు, ఎల్లుండి (29, 30 తేదీలలో) పోలియో చుక్కలు వేస్తామని , రాష్ట్ర హెల్త్ కమీషనర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఒక్కరూ కూడా మిగలకుండా యాక్షన్ ప్లాన్ ద్వారా పర్యవేక్షణ చేశామని, పల్స్ పోలియో ప్రోగ్రాం రాష్ట్ర పరిశీలకులు డా. అరుణ్, జాయింట్ డైరెక్టర్ జిల్లాలో పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రతినిధులకు , జిల్లా అధికారులకు, జర్నలిస్టులకు , ప్రజలకు , సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. గణేశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.






