29 June, 2026 | 2:05 AM

ఆడబిడ్డలకు తులం బంగారం ఏమైంది?

29-06-2026 12:00 AM

కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి:ఎమ్మెల్యే మాణిక్ రావు 

జహీరాబాద్, జూన్ 28 : కాంగ్రెస్ ప్రభు త్వం ఆడబిడ్డలకు ఇస్తానన్న తులం బంగా రం ఏమైందని మహిళలు అడుగుతున్నారని. జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని డిమాం డ్ చేశారు. ఆదివారం  జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ వి కన్వెన్షన్ లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆ ర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలకు అదనంగా తులం బంగారం ఇస్తామని పిసిసి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ ప్రభు త్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఆరోపించారు. పేదిం టి ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అందుతుందని ఆశపడి ప్రజలు ఓటేసి గెలిపిస్తే తు లం బంగారం మాట ఎత్తడం లేదని విమర్శించారు. 

ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లక్ష రూపాయల చె క్కును అందించిన వారందరికీ తులం బం గారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ యూనుస్, జరా సంఘం, మొ గుడంపల్లి మండలాల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, సంజీవరెడ్డి, జహీరాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ సంజీవ్, విశ్వేశ్వర్, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.