1 July, 2026 | 8:19 PM

Breaking News

లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •  

జిల్లాలో 90 శాతం రెవెన్యూ సదస్సులు పూర్తి

20-06-2025 12:45 AM

ఇప్పటి వరకు 28,118 దరఖాస్తులు స్వీకరణ: కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జూన్ 19(విజయక్రాంతి): భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సులు 90 శాతం పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్  తెలిపారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా టేక్మాల్ మండలంలో  ఎల్లంపల్లి గ్రామంలో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న నూతన భూభారతి రెవెన్యూ చట్టం 2025 రెవెన్యూ సదస్సును కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  భూభారతి రెవెన్యూ సదస్సులో తీసుకున్న దరఖాస్తులు అతి త్వరలో పరిష్కారం అవుతాయని చెప్పారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత వెబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని, ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా, భూభారతి చట్టంలోని నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ  క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బందిపాల్గొన్నారు.