17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఆటలతో ముగిసిన బడిబాట

20-06-2025 12:45 AM

వాజేడు, జూన్ 19 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చివరి రోజున ఆటలతో ముగిశాయి. మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాజేడు నాగారంలో గురువారం చివరి రోజున ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాలలో కొత్తగా నమోదైన విద్యార్థులతో పాటు అందరికీ ఖో ఖో,కబడ్డీ, త్రో బాల్ క్రీడాంశాలలోపోటీలు  నిర్వహించి బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు వివిధ క్రీడలలో ప్రావీణ్యం సాధించాలని ఆటలు శరీర మానసిక వికాశానికి తోడ్పడతాయని అన్నారు. ప్రతిరోజు ఒక గంట ఆటలు ఆడటం వలన శరీరం, చురుకుగా ఉల్లాసంగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చల్లగురుగుల మల్లయ్య, వెంకటరమణ, రంగు ఆనంద్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.