10 March, 2026 | 11:14 AM

పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం

10-03-2026 12:35 AM

నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్, మార్చి 9 (విజయక్రాంతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ లో బాగంగా సోమవారం కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో 2 కి. మీ రన్, ఎలక్ట్రానిక్ కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు. నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ నరెంధర్ రెడ్డి తో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ 2 కే రన్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరణ డ్రైను జెండా ఊపీ ప్రారంభించారు.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ... మన నివాస గృహంతో పాటు నగర పరిసరాలను కూడ పరిశుభగా ఉంచుకొవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో మొదటగా నగర పారిశుధ్య పపై ప్రధాన దృష్టి సారించామని తెలిపారు. నగర వ్యాప్తంగా 66 డివిజన్లలో ప్రణాళిక ప్రకారం పారిశుధ్య పనులు చేపట్టి డివిజన్లను పరిశుభగా మార్చుతున్నామని తెలిపారు.

నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు డివిజన్లలో ప్రభుత్వ కమ్యూనిటీ భవనాలు, బస్తీ దవఖానాలు, పాఠశాలలు తదిత ప్రభుత్వ భవనాలన్నిటీని పరిశుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రోజు 5 డివిజన్ల ను ఎంపిక చేస్కోని అదనంగా పారిశుధ్య కార్మికులన నియమించుకొని డివిజన్ పరిసరాలను, డ్రైనేజీలను శుభ్రపరచడం జరుగుతుందని తెలిపారు. డివిజన్ల లో ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ... వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు. వేసవి కాలం దృష్ట్యా సమ్మర్ ఆక్షన్ ప్లాన్ తో ప్రజలకు త్రాగు నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాలకవర్గ సభ్యులు, అధికారులు, పోలీస్ ట్రైనింగ్ సిబ్బంది, విద్యార్థులు, వాకర్స్ పాల్గొన్నారు.