18 August, 2026 | 12:28 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

లీకేజీల అడ్డుకట్టకు శాశ్వత చర్యలు

29-11-2024 01:49 AM

జలమండలి డీజీఎం మోహన్‌రాజ్

ముషీరాబాద్, నవంబర్ 28: ముషీరాబాద్ నుంచి సాగర్‌లాల్ దవాఖాన ప్రధాన రోడ్డు వరకు మంచి నీటి పైప్‌లైన్ లీకేజీలను అరికట్టేందుకు 1000 ఎంఎం భారీ మంచి నీటీ పైప్‌లైన్‌లను ఏర్పాటు చేస్తున్నామని జలమండలి రిజర్వాయర్ డీజీఎం మోహన్ రాజ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ముషీరాబాద్‌లోని చిలకలగూడ రిజర్వాయర్ నుంచి కొనసాగుతున్న పైప్‌లైన్ నిర్మాణ పనులను సెక్షన్ మేనేజర్ సురేశ్‌తో కలిసి పరిశీలించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు రూ.3.66 కోట్లతో చేపడుతున్న నిర్మాణ పనులు నెలరోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. రిజర్వాయర్ ప్రధాన గేటు వరకు, దాయారం మార్కెట్ నుంచి సాగర్‌లాల్ దవాఖాన చౌరస్తా వరకు పైల్‌లైన్ నిర్మాణ పనులు కొనసాగిస్తామని తెలిపారు.