20-01-2026 12:00:00 AM
చింతలకుంట నుంచి హయత్‌నగర్ రేడియో స్టేషన్ వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి
సుమారు రూ.600 కోట్లు కేటాయింపు
ఎంపీ ఈటల రాజేందర్ కృషితో ఫ్లై ఓవర్ మంజూరు
విజయవాడ జాతీయ రహదారిపై తీరనున్న ట్రాఫిక్ కష్టాలు
ఎల్బీనగర్, జనవరి 19 : ఎట్టకేలకు ఎల్బీనగర్ నియోజకవర్గంలో అతి పెద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చిం ది. ఇందుకు సుమారు రూ, 600 కోట్లు మంజురైనట్లు సమాచారం. విజయవాడ జాతీయ రహదారిని ఎనిమిది వరుసలుగా విస్తరించారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాల్సి ఉండడంతో విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. కాగా, వంతెన నిర్మాణాలపై బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. మట్టితో కాకుం డా మెట్రో రైలు కోసం నిర్మించినట్లుగా రోడ్డును పూర్తిగా మూసి వేయకుం డా పిల్లర్లతో కూడిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మా ణం చేప ట్టాలని గతంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు ఆందోళన చేపట్టారు.
దీంతో విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు, సర్వీసు రోడ్లు ఎల్బీనగర్ నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై అభ్యంతరాలు రావడంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు విస్తరణ పనులపై మల్లగుల్లాలు పడ్డారు. సమస్య పరిష్కారానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పలుమార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఇచ్చి, నిధులు మంజూరు చేయాలని కోరారు.
ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం అనుమతి
ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు పిల్లర్లతో కూడిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇందుకు సుమారు రూ. 600 కోట్లు మంజురైనట్లు సమాచారం. చింతలకుంట నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు సుమారు 5 కిలో మీటర్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. గతంలో పనామా చౌరస్తా, సుష్మా థియేటర్ మీదుగా ఆటోనగర్ వరకు ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జి, హయత్ నగర్ డిపో నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పుడు నిర్మించే ఫ్లై ఓవర్ బ్రిడ్జి సుమారు ఐదున్నర కిలో మీటర్ల వరకు భారీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయనున్నారు.
ఫలితంగా ఎల్బీనగర్ నుంచి కొత్తగూడెం వరకు ఎలాంటి అడ్డంకులు, ట్రాఫిక్ లేకుండా వాహనాలు సాఫీగా వెళ్తాయి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని జాతీయ రహదారి విస్తరణ పనులు పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో పనులకు అడ్డుగా ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఎల్బీనగర్ నియోజకవర్గం తోపాటు విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తీరనున్నది. దీంతో పాటు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు జాతీయ రహదారిలో సర్వీసు రోడ్లు, లింక్ రోడ్లు పూర్తి కానున్నాయి.